గమనిక .......
MPKBY ఏజెంట్స్ ద్వారా పోస్టల్ లావాదేవీలను జరిపే RD ఖాతాదారులకు తెలియజేయడమేమనగ ప్రతి RD ఖాతాదారుడు తన లావాదేవీలను జరుపు సమయములో ASLAS -5 కార్డులోఎంట్రీలు వేయించుకొనవలెను . ఏజెంట్ మీ డబ్బు పోస్ట్ ఆఫీసు లో జమ చేసిన తర్వాత కనీసం 5 రోజులలో మీ పాస్ బుక్ తిరిగి పొందవలెను. ఏజెంట్
పాస్ బుక్ ఇచ్చిన వెంటనే డబ్బు కరెక్టుగా పాస్ బుక్ లో జమ అయినది లేనిది,బ్యాలెన్సు సరిగా ఉన్నది లేనిది పోస్టల్ ముద్ర ఉన్నది లేనిది జాగ్రత్త
గా సరిచూసుకోనవలెను. MPKBY ఏజెంట్స్ ద్వారా క్రొత్తగా RD ఖాతా
తెరవాలనుకొనే క్రొత్త ఖాతాదారులు తప్పనిసరిగా పాస్ బుక్ తో పాటుగా
ASLAS -5 కార్డు కూడా ఏజెంట్ వద్ద తీసుకొనవలసినదిగా కోరుచున్నాము. ఇలా తీసుకొనలేకపోతే జరుగు నష్టములకు తపాలా శాఖ ఎటువంటి బాధ్యత వహించదని తెలియచేయుచున్నాము. కర్నూల్ డివిజన్ లోని ఏజెంట్స్ ద్వారా అన్ని రకముల లావాదేవీలు జరిపే తపాలా ఖాతాదారులకు (RD/MIS/PPF/TD etc) లావాదేవిల విషయంలో అతి జాగ్రత్తగా ఉండవలెనని తెలియ చేయు చున్నాము.
No comments:
Post a Comment